షార్ట్ ఫిలిం తీసేందుకు దరఖాస్తుల ఆహ్వానం: ఎస్పీ
EG: వివిధ విభాగాలలో షార్ట్ ఫిలిం తీసే ఔత్సాహికులకు తూ.గో.జిల్లా పోలీసులు ఆహ్వానం పలుకుతున్నారు. జిల్లా SP నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు నాలుగు విభాగాలపై షార్ట్ ఫిలిం తీయనున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్ నెస్ పై దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ మేరకు విజేతలకు రూ.10 వేలు నగదు, డిసెంబర్ 25 లోగా పంపాలని, 6 నిమిషాల నిడివి ఉండాలని సూచించారు.