VIDEO: 'చెత్త డంపుతో ఇబ్బందులు పడుతున్నాం'
NRML: నిర్మల్ మండలంలోని అనంతపేట గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌లో చెత్తకు నిప్పు పెట్టడంతో పొగ వ్యాపించి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ మాదాస్తు సునీత ఆధ్వర్యంలో గ్రామస్తులు ముక్కు మూసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు తెలిపినా స్పందన లేకపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.