డిసెంబర్ 3 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

డిసెంబర్ 3 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పెంపు

నిజామాబాద్: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు డిసెంబర్ 3 వరకు పొడిగించినట్లు డీఐఈవో రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాధ రుసుంతో డిసెంబరు 10 వరకు, రూ.500 రుసుంతో డిసెంబరు 17 వరకు, రూ.1000 అపరాధ రుసుంతో 24 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.