రాజధానిలో రీసెర్చ్ సెంటర్.. ఇంటెల్‌కు లోకేష్ ప్రతిపాదన
AP: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంటెల్ ప్రతినిధులకు అమరావతిలో AI రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. అలాగే ఎన్విడియా స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్టును రాష్ట్రంలోనూ ప్రారంభించాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. గూగుల్ డ్రోన్ అసెంబ్లీ యూనిట్, విశాఖలో అడోబ్ GCC ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.