ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి
BHNG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తించిన 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఓక దాన్ని చూపి ఓటు వేయొచ్చని స్పష్టం చేశారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వ ఉద్యోగుల ఐడీలు, రేషన్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ, పట్టాదారు పాస్‌బుక్ తదితరాలు ఉన్నాయి.