గుంటూరు ఛానల్‌లో వ్యక్తి గల్లంతు

గుంటూరు ఛానల్‌లో వ్యక్తి గల్లంతు

GNTR: మంగళగిరి పరిధి కాజా గ్రామంలోని గుంటూరు ఛానల్‌లోకి దిగి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై వెంకట్ తెలిపిన సమాచారం మేరకు.. దోడ్డక రాంబాబు (40) అనే వ్యక్తి కాలువలోకి దిగి ఈత కొట్టలేక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.