'ఆదోనిలో ప్రజా దర్బార్‌లో సమస్యల స్వీకారం'
KRNL: ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వీధిలైట్లు, నీటి సమస్యలు, రోడ్లు, భూ ఆక్రమణ, విద్యుత్ సమస్యలు, ఇండ్లు తదితర అంశాలపై అర్జీలు శుక్రవారం సమర్పించారు. ఆయన పరిశీలించి, పరిష్కారానికి సంబంధిత శాఖలకు సూచనలు చేశారు.