వడ్ల ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి
NZB: భీమ్‌గల్ మండలం బెజ్జోరాలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. వరి ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతు శ్రీనివాస్ (45) ట్రాక్టర్ కింద పడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.