వైసీపీకి తాళ్ళరేవు ఎంపీపీ రాజీనామా

తూ.గో: తాళ్ళరేవు ఎంపీపీ రాయుడు సునీత ఆదివారం వైసీపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీపీకి టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.