అభివృద్ధి పనులు ప్రారంభించిన సర్పంచ్
JN: పాలకుర్తి మండలంలోని గూడూరులో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు సర్పంచ్ మాచర్ల స్వరూప పుల్లయ్య శ్రీకారం చుట్టారు. మహిళా సమాఖ్య, అంగన్వాడీ కేంద్రం భవనాల నిర్మాణాలకుభూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ అంజయ్య, గ్రామ పాలన అధికారి యాదేశ్, గ్రామ ఉపసర్పంచ్ గుగ్గిళ్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.