ప్రభుత్వ ఆస్పత్రిలో పనులను పరిశీలించిన SE
KDP: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన నిర్మాణ పనులను శుక్రవారం SE లక్ష్మీపతి రెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని ఆయన కాంట్రాక్టర్లను ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తిచేసి రోగులకు అందుబాటులోకి తేవాలన్నారు. ఆస్పత్రి అబివృద్ధి కమిటీ సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, ఈఈ వెంకట్రామి రెడ్డి, ఏఈ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.