'ఉపాధి హామీ పనిదినాలు సగం తగ్గాయి'

'ఉపాధి హామీ పనిదినాలు సగం తగ్గాయి'

TG: ఉపాధి హామీ పనిదినాలు 12.22 కోట్ల నుంచి 6.5 కోట్లకు తగ్గాయని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. 'సీఎం రేవంత్ రెడ్డి 42 సార్లు ఢిల్లీ వెళ్లినా ఉపాధి దినాలు సగం తగ్గాయి. విషయం తెలిసినా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నాయి. ఉపాధి హామీ కూలీల వేతనాలు 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే కూలీల పనిదినాలు పెంచాలి. పెండింగ్ బకాయిలు చెల్లించాలి' అని డిమాండ్ చేశారు.