సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మన్

సచివాలయాన్ని తనిఖీ చేసిన మున్సిపల్ ఛైర్మన్

ప్రకాశం: విధి నిర్వహణలో సచివాలయం సిబ్బంది బాధ్యతాయుతంగా ఉండాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం పట్టణంలోని 4వ సచివాలయాన్ని మున్సిపల్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టిక సిబ్బంది పనితీరు, సంక్షేమపధకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది పనితీరుతో ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.