'ధూప దీప నైవేద్య అర్చకులకు వేతనాలు చెల్లించాలి'

'ధూప దీప నైవేద్య అర్చకులకు వేతనాలు చెల్లించాలి'

WNP: ధూప దీప నైవేద్య అర్చకులకు గత మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు లక్ష్మీకాంతాచార్యులు తెలిపారు. వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ లక్ష్మీకాంతాచార్యులు, గద్వాల జిల్లా అధ్యక్షులు పి.చక్రవర్తి కలిసి ఎండోమెంట్ ఇన్స్‌పెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అర్చకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.