ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం సరికాదు

SRPT: ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం సరికాదని బీఆర్ఎస్ తిరుమలగిరి మండల అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు రాజకీయాల లబ్ధి కోసమే అరెస్ట్ చేశారన్నారు.