VIDEO: భారీ వర్షాలకు నీట మునిగిన ఎద్దువాగు వంతెన

ELR: ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 5 గంటలకు 37.7 అడుగుల నీటిమట్టం చేరింది. వేలేరుపాడు మండలంలోని బోళ్లపల్లి-యడవల్లి మధ్య ఉన్న ఎద్దువాగు వంతెన నీట మునిగింది. దీంతో మండలకేంద్రం నుంచి యడవల్లి, కట్కూరు, కొయిదా, టేకూరు, తాళ్లగొంది, సిద్ధారం తదితర 16 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.