జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డీసీసీబీ ఛైర్మన్ ప్రచారం

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డీసీసీబీ ఛైర్మన్ ప్రచారం

MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మధురనగర్‌లో బుధవారం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.