'టీటీడీ ఛైర్మన్‌ని పదవి నుండి తొలగించాలి'

'టీటీడీ ఛైర్మన్‌ని పదవి నుండి తొలగించాలి'

PPM: ఈనెల 4న పార్వతీపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజల కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే దిశగా, బి.ఆర్. నాయుడుని వెంటనే ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చే శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.