రుణ దరఖాస్తులకు గడువు పెంపు: MPDO

KDP: ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరు కొరకు దరఖాస్తు గడువు మే 10 వరకు పెంచడం జరిగిందని చిట్వేలు MPDO మోహన్ శనివారం తెలిపారు. లబ్ధిదారుడు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండి, వయస్సు 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండడంతోపాటు బీపీఎల్ కేటగిరీ కింద ఉండాలన్నారు. స్వయం ఉపాధి పథకాలలో రవాణా రంగానికి దరఖాస్తు చేసుకునేవారు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలన్నారు.