హరీష్ రావును పరామర్శించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

హరీష్ రావును పరామర్శించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

MDK: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామాయంపేట పట్టణంకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం హరీష్ రావును పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ ఛైర్మన్ భాదే చంద్రం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.