'NPCL కంపెనీ సేవలు ప్రశంసనీయం'
PPM: NPCL కంపెనీ పార్వతీపురం నియోజకవర్గానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఎన్‌పీసీఎల్ కంపెనీ, కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నియోజకవర్గానికి గతంలో నాలుగు అంబులెన్సులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. అలాగే తాజాగా పార్వతీపురం నియోజకవర్గానికి 4, పాలకొండ నియోజకవర్గానికి 2 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసిందన్నారు.