ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన సీఐ
VZM: ఎస్ కోట మండలం దారపర్తి గ్రామంలోని 120 మంది ప్రజలకు సీఐ నారాయణమూర్తి గురువారం నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో వారు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే లలిత కుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అనంతరం వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.