కొత్త చట్టాలపై అవగాహన
AKP: కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలపై ఎస్సై సావిత్రి ఎలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు సోమవారం అవగాహన కల్పించారు. హెచ్ఎం వైవి రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ కుందూరు రాజ పాల్గొన్నారు.