'అభివృద్ధికి నిధులు విడుదల చేయండి'

KMM: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరింత నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నేత మట్టా దయానంద్ విజయ్ కుమార్ బుధవారం హైదరాబాద్‌లో మంత్రుల క్వార్టర్స్‌లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆయన ఛాంబర్‌లో బుధవారం కలిశారు. మైనింగ్ శాఖ ఛైర్మన్ అనీల్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లను కూడా కలిసి అభ్యర్థించారు.