వైసీపీ కార్పొరేటర్ పై కేసు

NLR: నెల్లూరు గ్రామీణ మండలానికి చెందిన వైకాపా కార్పొరేటర్ సుధాకర్, తన ప్లాట్ల వద్దకు వచ్చిన బద్వేల్ మోహన్ పై ఇటుక రాయితో దాడి చేశారని ఆరోపణలు వెలువడ్డాయి. జరిగిన ఘటనలో మోహన్‌కు గాయాలయ్యాయి. బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆకుతోట ప్రాంతంలోని షిరిడీ సాయి లే అవుట్‌లో మోహన్ ప్లాట్ల చుట్టూ కంచె వేయడాన్నీ గుర్తించారు.