పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలు
W.G: స్వాతంత్య్ర సమరయోదుడు, వందేమాతరం గేయ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని పోడూరు మండలం చింతలగరువు పాఠశాలలో హెచ్.యం కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన బుధవారం ఘనంగా జరిగింది. ముందుగా ఛటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు.