తీరప్రాంత రక్షణకు సైకిల్ యాత్ర
VSP: వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం దేశవ్యాప్తంగా "వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్-2026"ను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను సీఐఎస్ఎఫ్ డీఐజీ డాక్టర్ ఎం.జి. రాఘవేంద్ర కుమార్ సోమవారం విశాఖలో వెల్లడించారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు తీరప్రాంత రక్షణకు ఈ సైకిల్ యాత్ర కొనసాగుతుందన్నారు.