వెంకటాపురం చెరువులో మృతదేహం లభ్యం

వెంకటాపురం చెరువులో మృతదేహం లభ్యం

TPT:రేణిగుంట మండలం వెంకటాపురం చెరువులో ఓయువకుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రేణిగుంట అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కొద్దిగా ఉబ్బి ఉండడంతో 24 గంటల క్రితం చనిపోయి ఉండ వచ్చని భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను ఎవరనేది తెలియాల్సి ఉంది.