ఆడిట్ నిర్వహణకు మే 8 లోపు దరఖాస్తులు సమర్పించాలి

PDL: జిల్లాలోని మున్సిపల్ రికార్డుల ఆడిట్ నిర్వహణకు ఆసక్తి గల ఆడిటర్లు మే 8 లోపు దరఖాస్తులు సమర్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆడిట్ నిర్వహణకు ఆసక్తి,అర్హత కలిగిన ఆడిటర్లు తమ దరఖాస్తులను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో సమర్పించాలని, ఇతర వివరాలకు 6304894940 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.