VIDEO: క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ
ప్రకాశం: కంభంలో జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కందులాపురం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ.. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.