పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ
నంద్యాల మున్సిపాలిటీ 6వ వార్డులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి, పోలియోను శాశ్వతంగా నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని పిలిపునిచ్చారు.