రైతులు అప్రమత్తంగా ఉండాలి
KNR: గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సర్పంచ్ వేముల భాస్కర్ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశు పెంపకందారులు తమ పశువులకు టీకాలు వేయించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తూము రాజు కుమార్ పాల్గొన్నారు.