మదనపల్లెలో 5 మంది పాకిస్తానీయులు గుర్తింపు.!

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో ఐదుగురు పాకిస్థానీయులను ఆదివారం పోలీసులు గుర్తించారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి ఘటన తర్వాత ప్రధాని మోదీ పాకిస్థానీయులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా పోలీసులు కురవంక ప్రాంతంలో వారిని గుర్తించారు. స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.