కొనసాగుతున్న ఉగ్రలింకుల కేసు విచారణ
AP: విజయవాడ ఉగ్రలింకుల కేసులో ఐదో రోజు నిందితుల కస్టడీ విచారణ కొనసాగుతోంది. విజయవాడ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో నాలుగు రోజులపాటు నిందితులను అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించి.. కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. ఇవాళ్టితో కస్టడీ విచారణ ముగియనుంది. మహమ్మద్ రహంతుల్లా, డానిష్, సోహైల్ బేగ్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.