విజయవాడలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.!

NTR: విజయవాడలో ఆగస్టు 15 ఉదయం 7 గంటల నుంచి ట్రాఫిక్ మార్పులు అమల్లోకి వస్తాయి. కంట్రోల్ రూమ్ నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలు RTC వై జంక్షన్–ఏలూరు రోడ్–చుట్టుగుంట–రామవరప్పాడు రింగ్ మీదుగా మళ్లిస్తారు. బెంజ్ సర్కిల్ నుంచి బందర్ రోడ్ వాహనాలు ఫకీర్ గూడెం–స్క్యూ బ్రిడ్జ్–బస్టాండ్ వైపు మళ్లిస్తారు. రెడ్ సర్కిల్–వెటరినరీ జంక్షన్ మధ్య అనుమతి లేదు