జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

అల్లూరి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జీ.మాడుగుల మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ముంచంగిపుట్టు 7.7 డిగ్రీలు, డుంబ్రిగుడ 8.2 డిగ్రీలు, అరకు 8.9, చింతపల్లి 9.5, హుకుంపేట 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో చలి తీవ్రంగా ఉంది.