డెంగ్యూ కేసుల పేరుతో భయపెడితే చర్యలు: కలెక్టర్

డెంగ్యూ కేసుల పేరుతో భయపెడితే చర్యలు: కలెక్టర్

NLG: డెంగ్యూ పేరుతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఈ మేరకు ఇబ్బందులు సృష్టించే వారిపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.