VIDEO: పిల్లలమర్రిలో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు
SRPT: సూర్యాపేట మండలం పిల్లలమర్రిలోని శ్రీ ఎర్రకేశ్వర, శ్రీణామేశ్వర స్వామి దేవాలయాల్లో కన్నుల పండుగగా కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. పరమశివుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉసిరి, మారేడు చెట్ల కింద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.