గుంటూరులో కార్డాన్ సెర్చ్

GNTR: నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు లక్ష్యంగా గుంటూరులోని కోబాల్ట్ పేటలో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. 125 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా వీధుల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. ఆపరేషన్‌లో భాగంగా నెంబర్ ప్లేట్లు, పత్రాలు లేని 61 బైక్‌లు, నాలుగు ఆటోలను సీజ్ చేశారు.