శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

TPT: శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని రౌడీలకు గూడూరు టూ టౌన్ సీఐ జే శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. తప్పనిసరిగా ప్రతివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలన్నారు. అలాగే చట్టబద్ధంగా వ్యవహరించాలని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.