'ఉత్తమ కమిషనర్‌గా.. బోడుప్పల్ కమిషనర్'

మేడ్చల్: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉత్తమ సేవలు, నిబద్ధతకుగాను బోడుప్పల్ నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.శైలజకు జిల్లా కలెక్టర్ మనూ చౌదరి ఉత్తమ కమిషనర్ విభాగంలో ప్రశంస పత్రం అందజేశారు. ఉత్తమ పారిశుధ్య సేవలకు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ బీ.నారాయణ రెడ్డి, వార్డు స్థాయిలో సేవలకు వార్డు ఆఫీసర్ సరితలకు ప్రశంస పత్రాలు అందించారు.