ఎస్పీని కలిసిన మహిళా ఇన్స్పెక్టర్

ఎస్పీని కలిసిన మహిళా ఇన్స్పెక్టర్

SKLM: ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా జిల్లా మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బి.నారిమణి ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మహిళా భద్రత, మహిళలకు సంబంధించిన కేసుల పరిష్కారంలో బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. మహిళా భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు.