VIDEO: రోడ్డుపై ధాన్యం.. వాహనదారుల అవస్థలు

VIDEO: రోడ్డుపై ధాన్యం.. వాహనదారుల అవస్థలు

JN: పాలకుర్తి మండలం నుంచి రాయపర్తి వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ధాన్యం కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రయాణికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే కారణంతో ప్రమాదం జరిగినట్లు పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.