ఓయూలో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.