ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. తప్పిన పెను ప్రమాదం
ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలోని న్యూ కాలనీ వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.