పాలకొల్లులో ఈ నెల 11న జాబ్ మేళా
W.G: పాలకొల్లు ఛాంబర్స్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11న హైదరాబాద్‌కు చెందిన హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ ప్రతినిధులు జూనియర్ కెమిస్ట్, ట్రైనీ ప్రొడక్షన్ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.