కోర్టు వద్ద రహదారి ప్రమాదకరం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కోర్టు సమీప ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. మిషన్ భగీరథ పైపు లీకేజీ మరమ్మతుల తర్వాత మట్టిని అలాగే వదిలేయడంతో రోడ్డుమధ్య కుప్పలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదం ఎక్కువవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే మట్టిని తొలగించి బీటీ రోడ్డు వేయాలని కోరుతున్నారు.