కూలీలతో కలిసి నాట్లు వేసిన ఎస్సై

కృష్ణా: వ్యవసాయ కూలీల కష్టాలను తెలుసుకునేందుకు కోడూరు ఎస్సై పి. శిరీష స్వయంగా వారితో పొలంలో దిగి నాటు వేశారు. మంగళవారం కోడూరు గొల్లపాలెం రోడ్డు సమీపంలో నాటు వేస్తున్న మహిళలను చూసి వారితో మాట్లాడి, వారితో పాటు కాసేపు నాటు వేశారు. ఈ సందర్భంగా తన చిన్న తనం నుంచి మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివించారని ఆమె గుర్తు చేసుకున్నారు.