చెత్త కుప్పలో లభ్యమైన నవజాత శిశువు
ATP: ముక్కు పచ్చలారని శిశువు చెత్తకుప్పలో దర్శనం ఇచ్చింది. అనంతపురంలోని సాయినగర్ 7వ క్రాస్‌లో అప్పుడే పుట్టిన నవజాత శిశువు ఆడ బిడ్డను ఓ తల్లి వదిలేసి వెళ్లిపోయింది. చిన్నారి కేకలు వేయడంతో చెత్త కుప్ప వద్ద స్థానికులు గుమికూడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.