స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం

NGKL: సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 79వ స్వాతంత్య్రం నాటికి భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వెల్లడించారు.